Share News

ఎక్కువ ధరకు జొన్నలు అమ్మి నష్టాలు తగ్గిస్తాం!

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:55 AM

మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, జొన్నల్ని వీలైనంత ఎక్కువ ధరకు విక్రయించి నష్టాలను తగ్గించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. టెండర్లు మూడు సార్లు పిలవగా, తక్కువ ధరలు వచ్చినందున వాటిని రద్దు చేసి, మార్కెట్‌ ధరలు ఆధారంగా జొన్నలను విక్రయించే సిఫారసు చేశారు.

ఎక్కువ ధరకు జొన్నలు అమ్మి నష్టాలు తగ్గిస్తాం!

  • డిస్పోజల్‌ కమిటీ ఆదేశాలమేరకు ప్రభుత్వానికి నివేదిక

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై మార్క్‌ఫెడ్‌ ఎండీ వివరణ

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలు, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం వీలైనంత ఎక్కువ ధరకు జొన్నలు విక్రయించి నష్టాలను తగ్గించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నామని మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఆరుగురు సభ్యులతో కూడిన డిస్పోజల్‌ కమి టీ నిర్ణయం ప్రకారం మూడుసార్లు టెండర్లు పిలువగా గుత్తేదారులు నమోదుచేసిన ధరలు, ప్రస్తుత మార్కెట్‌ ధరలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ‘‘మార్క్‌ఫెడ్‌ జొన్నలు అగ్గువకు!’’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన కథనంపై శ్రీనివా్‌సరెడ్డి వివరణ ఇచ్చారు.


మొదటిసారి టెండరు పిలిస్తే గుత్తేదారులు టన్నుకు రూ.18,587.66 కోట్‌ చేయగా తక్కువ ధర వచ్చిందని టెండరు రద్దు చేసినట్టు తెలిపారు. రెండోసారి టెండరులో టన్నుకు రూ.18,799.91 నమోదు చేసినా రద్దు చేశామన్నారు. మూడోసారి టెండరులో టన్నుకు రూ.18,801.41 ధర రాగా, డిస్పోజల్‌ కమిటీ ఆదేశాలమేరకు జొన్నలు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించారు. 10నెలలుగా గోదాముల్లో జొన్నలు ఉండటంతో నాణ్యత తగ్గిపోతోందని, కొత్త పంట వస్తున్నందున పాత పంట ధర గణనీయంగా తగ్గుతోందని ఎండీ వివరించారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 03:55 AM