Share News

ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:55 PM

ప్రజల ప్రాణాలు పోతున్నా హెచ్‌కేఆర్‌ రోడ్డు సంస్థ పట్టించు కోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారి నిత్యం వాహనాలు బోల్తాపడుతున్నా మూలమలుపును సీపీఐ బృందం సోమవారం పరిశీ లించింది.

 ఫ్లై ఓవర్‌ నిర్మించాలి

కళ్యాణ్‌నగర్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలు పోతున్నా హెచ్‌కేఆర్‌ రోడ్డు సంస్థ పట్టించు కోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారి నిత్యం వాహనాలు బోల్తాపడుతున్నా మూలమలుపును సీపీఐ బృందం సోమవారం పరిశీ లించింది. ఆదివారం రాత్రి జీఎం కాలనీ రాజీవ్‌ రహదారిపై యాష్‌ ట్యాం కర్‌ బోల్తా పడిందని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవ డంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇప్పటికే 50 వాహ నాల వరకు బోల్తా పడినా హెచ్‌కేఆర్‌ సంస్థ, ప్రజాప్ర తినిధులు పట్టించుకోవడం లేదన్నారు. గంగానగర్‌ నుంచి రామగుండం బీ పవర్‌హౌస్‌ వరకు ఫ్లై ఓవర్‌ నిర్మించి ప్రమాదాలను అరికట్టాలన్నారు. లేకపోతే టోల్‌గేట్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బ్రిడ్జిల నిర్మాణం కాకముందే నిబంధ నలకు విరుద్ధంగా టోల్‌ ట్యాక్స్‌ను ఎలా వసూలు చేస్తా రని ఆయన ప్రశ్నించారు. జీఎం కాలనీ వద్ద ఉన్న మూలమలుపును విస్తరించి ప్రమాదాలను నివారిం చాలని డిమాండ్‌ చేశారు. మోహన్‌, గౌతం గోవర్ధన్‌, మల్లయ్య, ఓదమ్మ, రమేష్‌ కుమార్‌ ఉన్నారు.

రాజీవ్‌ రహదారిపై బూడిద ట్యాంకర్‌ బోల్తా

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ రహదారిపై గోదా వరిఖని జీఎం కార్నర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి తరు వాత బూడిద ట్యాంకర్‌(కేఏ32సీ7417) బోల్తా పడింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి లిక్విడ్‌ బూడిద లోడ్‌తో వెళుతున్న లారీ జీఎం ఆఫీస్‌ కార్నర్‌ వద్ద అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డుపై పడింది. ఆ సమయంలో సర్వీస్‌ రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - Mar 31 , 2025 | 11:55 PM