Share News

మత్తుకు యువత బానిస కావొద్దు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:55 PM

మత్తుకు యు వత బానిస కావొద్దని కలెక్టర్‌ ఎం. హనుమంతరావు సూచించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కలెక్టరేట్‌లో శుక్రవారం మిషన్‌ పరివర్తన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది.

మత్తుకు యువత బానిస కావొద్దు

కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి (కలెక్టరే ట్‌), మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మత్తుకు యు వత బానిస కావొద్దని కలెక్టర్‌ ఎం. హనుమంతరావు సూచించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కలెక్టరేట్‌లో శుక్రవారం మిషన్‌ పరివర్తన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన కలెక్టర్‌ జిల్లా సంక్షేమాధికారి కే.నరసింహారావుతో కలిసి మిషన్‌ పరివర్తన్‌ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. మిషన్‌ పరివర్తన్‌ కమిటీలో సభ్యులైన పోలీస్‌, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ, ఎక్సైజ్‌, విద్యా, వైద్యశాఖలు, ఎన్జీవోలు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మత్తు బారిన పడిన వారికి రిహాబిలిటేషన్‌ ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్‌ పరివర్తన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహ ర్‌, డీఈవో సత్యనారాయణ, ఎక్సైజ్‌ సీఐ రాధాకృష్ణ, శంకర్‌ ప్రకా్‌షరెడ్డి, కోమలి, ప్రమీల, శశికళ, యశోద, మిషన్‌ పరివర్తన్‌ కోఆర్డినేటర్‌ శ్రవణ్‌, మంజుల, సుమ, తదితరులు పాల్గొన్నారు.

యూడీఐడీ కార్డుతో దేశమంతటా దివ్యాంగులకు సేవలు

భువనగిరి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన యూనిక్‌ డిజబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ)తో దివ్యాంగులు తమకు లభించే ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవలను దేశమంతటా పొందవచ్చని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఆయన యూడీఐడీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

యూడీఐడీ దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు కార్డు అని, కార్డును స్కాన్‌ చేస్తే సంబంధిత దివ్యాంగుడి సమస్త వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో అర్హులైన 12,940 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4016 చొప్పున రూ.5.20కోట్లు ఫించన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ శ్రీశైల చిన్న నాయక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ పాండునాయక్‌, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:55 PM