గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:16 AM
నల్లగొండ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఎస్పీ(స్పెషల్‌బ్రాంచ) రమేష్ సూచించారు.

నల్లగొండ క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఎస్పీ(స్పెషల్‌బ్రాంచ) రమేష్ సూచించారు. ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో భగత సింగ్ జయంతి సందర్భంగా ఎనజీ కళాశాల నుంచి బస్టాండ్ వరకూ సే నో టూ డ్రగ్స్ అనే నినాదంతో 2కే రనను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో అధికశాతం ఉన్న యువత డ్రగ్స్, గంజాయి బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ఎస్పీ శరతచంద్ర పవార్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. స్పెషల్ కిట్ల ద్వారా గంజాయి తాగే వారిని గుర్తించి మొదటిసారి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. అదేసమయంలో విక్రయాలు జరిపే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు అనంతుల శంకరయ్య, ఎస్‌ఎ్‌ఫఐ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, నాయకులు గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నల్పరాజు సైదులు, కోట్ల అశోక్‌రెడ్డి, పాలది కార్తీక్, మరుపాక కిరణ్, కావ్య, స్పందన, పోకల శశి, సైఫ్, సాయి, నవదీప్, భీమగాని గణేష్, షరీఫ్, బాలరాజు, మహేష్, నాగయ్య తదితరులు ఉన్నారు.