Share News

మొబైల్‌ చోరీలు తగ్గుముఖం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:15 AM

సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌ వచ్చాక మొబైల్‌ దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

మొబైల్‌ చోరీలు తగ్గుముఖం
నల్లగొండలో సెల్‌ఫోనలు పొందిన వారితో కలిసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరాంరెడ్డి

108 ఫోన్లు రికవరీ, బాధితులకు అప్పగింత

నల్లగొండ క్రైం, మార్చి 22(ఆంధ్రజ్యోతి) : సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌ వచ్చాక మొబైల్‌ దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నల్లగొండ సబ్‌డివిజన పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 108 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా టూటౌనలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ టూటౌన, రూరల్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. దీంతో ఫోన ఎవరు వాడుతున్నారో ట్రాక్‌చేసి ఆ ఫోన్లను రికవరీ చేశామన్నారు. నల్లగొండ టూటౌన పరిధిలో 100 మంది, రూరల్‌ పరిధిలో 8మంది బాధితులకు సంబంధించి కానిస్టేబుళ్లు ఎల్‌.బాలకోటి, రేవతి ఆధ్వర్యంలో రికవరీ చేశామన్నారు. సెల్‌ఫోన పోయిన వెంటనే సిమ్‌కార్డును బ్లాక్‌చేసి పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయాలన్నారు. తద్వారా ఫోనలో డాటా వేరే వారి చేతుల్లోకి పోకుండా ఉంటుందన్నారు. రికవరీ చేసిన ఫోన్లను టూటౌన సీఐ రాఘవరావు, ఎస్‌ఐలు ఎర్ర సైదులు, గాజుల మానస, సిబ్బంది బాలకోటి, నాగరాజు తదితరుల సమక్షంలో అందజేశారు.

Updated Date - Mar 23 , 2025 | 12:15 AM

News Hub