మహిళలు ఆరోగ్యంగా ఉండాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:59 PM
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మా ట్లాడారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి
పెద్దఅడిశర్లపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మా ట్లాడారు. భావితరాల భవిష్యత్తు గర్భిణుల చేతుల్లోనే ఉందని, వారు తీసుకునే ఆహారం, జాగ్రత్తలపై పుట్టే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతీ మహిళ తప్పనిసరిగా పౌష్ఠికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవాలన్నారు. దేవరకొండ ప్రాంతంలో మహిళల్లో రక్తహీనత, మాతా శిశు మరణాలు, బాల్యవివాహాలు తదితర సమస్యలు అధికంగా ఉన్నాయని, అందుకే ఈ ప్రాంతాల్లో మహిళలు వివిధ జబ్బులతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. వీటన్నింటినీ అరికట్టేందుకు మహిళల్లో పౌష్ఠికాహారం, సరైన సమయంలో వైద్య చికిత్సలు, పిల్లల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో వసతులను పరిశీలించారు. మండల కేంద్రంలో పోలీ్‌సస్టేషన్, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పలువురు నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మానిక, డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, వైద్యురాలు విజయ, ఎంపీడీవో పద్మ, తహసీల్దార్ మధుహాసిని, డాక్టర్ రాజేష్, తదితరులు పాల్గోన్నారు.