లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తా
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:46 PM
పట్టణంలోని డబుల్ బెడ్ రూం గృహాల్లో నెలకొని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చె న్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని డబుల్ బెడ్ రూం గృహాల్లో నెలకొని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చె న్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తెలిపారు. ఆదివారం పట్టణంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లను సందర్శించారు. లబ్ధిదారులు పలు సమస్యలను విన్నవించారు. విద్యుత్ ఏఈతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి గృహాలకు వి ద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే అక్కడే ఉన్న మున్సిపల్ కమిష నర్ రాజలింగును తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుం ద న్నారు. లాటరీ పద్ధతి ద్వారా డబుల్‌బెడ్‌రూం గృహాల లబ్దిదారులను ఎం పిక చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఉపేందర్‌గౌడ్, సొత్కు సు దర్శన్, సదానందం యాదవ్, పాల్గొన్నారు.
ఫముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివేక్‌వెం కటస్వామి అన్నారు. పట్టణంలోని 1వ జోన్ అస్రా మసీదులో ఆదివారం ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. రంజాన్ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అస్రా మసీదు ముస్లిం పెద్దలు పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ముస్ల్లిం పెద్దలు మహ్మద్ గు లాం, లతీఫ్, ఎండీ ఇసాక్ పాల్గొన్నారు.