Share News

Minister: కొత్త ఉస్మానియా ఆస్పత్రి ద్వారా.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:38 AM

నగరంలో కొత్తగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) ద్వారా అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు.

Minister: కొత్త ఉస్మానియా ఆస్పత్రి ద్వారా.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు

- 31న సీఎంతో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయండి: మంత్రి

హైదరాబాద్‌: నగరంలో కొత్తగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) ద్వారా అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) తెలిపారు. రోగులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్‌ నూతన భవనాల డిజైన్లు, శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Mayor: మేయర్‌ సంచలన నిర్ణయం.. ఇక ఎన్నికల్లో పోటీ చేయను


city2.2.jpg

ఈ నెల 25న ఉస్మానియా హాస్పిటల్‌ డిజైన్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. పలు మార్పులు సూచించారు. ఈ మేరకు భవన నమూనాల్లో ఆర్కిటెక్ట్‌లు మార్పులు చేశారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడారు. గోషామహల్‌లో ఈ నెల 31న ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


వార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు

ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను

Read Latest Telangana News and National News

Updated Date - Jan 29 , 2025 | 07:38 AM