Share News

తెలంగాణ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:52 AM

ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణ అప్పు రూ.4,42,298 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.5,62,557 కోట్లు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు.

తెలంగాణ అప్పులు  రూ.4.42 లక్షల కోట్లు

  • ఏపీ తీసుకున్న రుణం రూ.5.62 లక్షల కోట్లు

  • లోక్‌సభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి

న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణ అప్పు రూ.4,42,298 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.5,62,557 కోట్లు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ) 34.7 శాతం ఉందని, తెలంగాణ అప్పులో జీఎ్‌సడీపీ 26.2శాతం ఉందని వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు.


అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తమిళనాడు అప్పు రూ.9,55,691 కోట్లు కాగా.. తర్వాతి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌(రూ.8,57,844 కోట్లు), మహారాష్ట్ర (రూ.8,12,068 కోట్లు), కర్ణాటక (రూ.7,25,456 కోట్లు), పశ్చిమ బెంగాల్‌ (రూ.7,14,196కోట్లు) ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్బీఐ అంచనా ప్రకారం 2025 మార్చి 31 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి అప్పు రూ.2,67,35,462 కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:52 AM