Share News

Mahesh Kumar Goud: అన్ని కోణాల్లో ఆలోచించే అభ్యర్థుల ఎంపిక

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:18 AM

అన్ని కోణాల్లో ఆలోచించే ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. పార్టీ అభ్యర్థులు అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Mahesh Kumar Goud: అన్ని కోణాల్లో ఆలోచించే అభ్యర్థుల ఎంపిక

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): అన్ని కోణాల్లో ఆలోచించే ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. పార్టీ అభ్యర్థులు అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్‌ నాయక్‌కు అవకాశమివ్వడం ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తల పార్టీ అన్న భరోసా ఇచ్చిందన్నారు. 2014 నుంచి కాంగ్రె్‌సలో క్రియాశీలకంగా పని చేస్తున్న అద్దంకికి తెలంగాణ ఉద్యమకారుడిగానూ పేరుందన్నారు. కాంగ్రెస్‌ గొంతుకగా.. బీజేపీ, బీఆర్‌ఎ్‌స ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని గుర్తు చేశారు.


బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలనుకున్న అధిష్ఠానం.. బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ పోరాట నేత విజయశాంతికి టికెట్‌ ఇచ్చిందన్నారు.కాగా, రాష్ట్రంలో జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎంపీ అనిల్‌కుమార్‌, పార్టీ నేతలు తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌, బెల్లయ్య నాయక్‌, వెన్నెల గద్దర్‌తో కూడిన సమన్వయ కమిటీని మహేశ్‌గౌడ్‌ ఏర్పాటు చేశారు

Updated Date - Mar 10 , 2025 | 03:18 AM