High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:49 AM
అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి(Osmania General Hospital)ని గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలిస్తే తప్పేమిటని హైకోర్టు(High Court) ప్రశ్నించింది. దానిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణ యం సరికాదని పేర్కొంటూ గౌలిగూడకు చెందిన మునుకుంట్ల ఆనంద్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.

- సీఎంను ప్రతివాదిగా ఎందుకు చేర్చారు: హైకోర్టు ప్రశ్నలు
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి(Osmania General Hospital)ని గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలిస్తే తప్పేమిటని హైకోర్టు(High Court) ప్రశ్నించింది. దానిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణ యం సరికాదని పేర్కొంటూ గౌలిగూడకు చెందిన మునుకుంట్ల ఆనంద్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘మంథన్’ విద్యార్థినికి కేంబ్రిడ్జి లెర్నర్స్ అవార్డు
ముఖ్యమంత్రిని ప్రతివాదుల జాబితాలో ఎందుకు చేర్చారని, ముందుగా దానిని తొలగించాలని ఆదేశించింది. ఆస్పత్రి తరలింపు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. వందేళ్లపైగా చరిత్ర ఉన్న ప్రస్తుత భవనం సరిగా లేదని హైకోర్టునే తరలిస్తున్నారని, అలాంటప్పుడు ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News