Share News

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:09 PM

యు వత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకొని దేశభక్తిని పెంపొందించు కోవా లని ఉమ్మడి జిల్లా యువజన సర్వీసుల శాఖ, యూత్‌ అధికారి సుశీల్‌బాడ్‌, సీవీరామన్‌ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ గడిపెల్లి నర్సయ్య పేర్కొన్నారు.

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి29 (ఆంధ్రజ్యోతి): యు వత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకొని దేశభక్తిని పెంపొందించు కోవా లని ఉమ్మడి జిల్లా యువజన సర్వీసుల శాఖ, యూత్‌ అధికారి సుశీల్‌బాడ్‌, సీవీరామన్‌ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ గడిపెల్లి నర్సయ్య పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని సీవీరామన్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్ర యు వజన సర్వీసు లశాఖ, క్రీడాశాఖల ఆధ్వర్యంలో జిల్లా స్థా యి యువజన ఉత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్‌ఫేర్‌, ఫొటో గ్రఫీ, చిత్రలేఖనం, కవితా సంకలనం, ఉపన్యాసం, కల్చరల్‌ పోటీల్లో జిల్లాకు చెందిన పలు డిగ్రీ కళాశాలల విద్యార్థు లు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. మొదటి బహుమతిగా 7వేల నగదు, తృతీయ బహుమతికి 5వేలు, తృతీయ 3,500 నగదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను నైపు ణ్యాన్ని వెలికితీయడానికి ఈ వేదిక సరిగ్గా ఉపయోగ పడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరో హించాలని ఆకాంక్షించారు. అమృత ఉత్సవాలను విద్యార్థుల కోసం కేటాయించి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి యువజన ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి మోదీఅభినందనీయుడన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం అధికారి సురేశ్‌, ఉమ్మడి జిల్లా కళాశాలల సంఘం అధ్యక్షుడు రమణ, శ్రీహర్ష కా లేజీ కరస్పాండెంట్‌ పల్లె భూమేశ్‌, మిమ్స్‌ కాలేజీ డైరెక్టర్‌ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:09 PM