తప్పు ఒప్పుకున్న శ్యామల.. విచారణకు సహకరిస్తా..

ABN, Publish Date - Mar 24 , 2025 | 01:59 PM

బెట్టింగ్ యాప్స్‌ కేసులో నటి, యాంకర్ శ్యామల ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆమెను పోలీసులు విచారించారు.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసు (Betting Apps Case)లో నటి, యాంకర్ (Actress, Anchor) శ్యామల (Shyamala) సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు (police interrogation) హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని... విషయం కోర్టులో ఉందని, ఈ సమయంలో దీనిపై మాట్లాడడం సరికాదని అన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని, చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని.. దీనివల్ల నష్టపోయిన కుటుంబాల లోటు తీర్చలేమని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని శ్యామల స్పష్టం చేశారు.

Also Read..: ABN Live..: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త


బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల తన న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆమెను పోలీసులు విచారించారు. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖలో ఐపీఎల్ క్రికెట్ సమరం

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

For More AP News and Telugu News

Updated at - Mar 24 , 2025 | 01:59 PM