Mahasena Rajesh: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు.. మహాసేన రాజేష్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Mar 28 , 2025 | 04:01 PM
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తూర్పుగోదావరిజిల్లా: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్‌లను, పోస్టుమార్టం రిపోర్టను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ ప్రగడాల మృతి దర్యాప్తులో జాప్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు.
కొవ్వూరు టోల్ గేట్‌కు ముందే అయనపై దాడి జరిగినట్లు తాము అనుమానిస్తున్నామని మహాసేన రాజేష్ అన్నారు. కొవ్వూరు - అనంతపల్లి టోల్‌గేట్‌ల మధ్య ఉన్న సీసీ కెమెరాల ఫుల్ ఫుటేజ్ టైంతో పాటు విడుదల చేయాలని కోరారు. పెట్రోల్ బంక్ ముందు బైక్ పడిపోయిన తర్వాత ఎవరైనా అయనపై దాడిచేసి చంపారనే అనుమానాలు తమకు బలపడుతున్నాయని మహాసేన రాజేష్ తెలిపారు.
ఎక్కడో పాస్టర్‌ను చంపి ఇక్కడ ఆయన శవాన్ని పడవేసి ఆయనపై బైక్ పడుకోబెట్టారని తమకు అనుమానం ఉందని మహాసేన రాజేష్ చెప్పారు. విజయవాడ నుంచి కొవ్వూరు వరకు అయన దాటిన టోల్‌గేట్ ఫుటేజ్ విడుదల చేయాలని కోరారు. పాస్టర్‌ను రెడ్ కారుతో ఉద్దేశ్య పూర్వకంగా గుద్ది చంపారని తమకు అనుమానం ఉందని చెప్పారు. ఆ ఎరుపు రంగు కారు ఎక్కడ నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది.. ఆ కార్ ఓనర్ ఎవరని మహాసేన రాజేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆ వివరాలను వెంటనే బయట పెట్టాలని మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. పాస్టర్‌ను కర్రలతో కొట్టి చంపారని, రాడ్‌తో కొట్టి చంపారని తమకు అనుమానంగా ఉందని అన్నారు. అలాంటి గాయాలు ఏమైనా ఆయన ఒంటిపై శవ పంచానామాలో గమనించారా లేదా అని నిలదీశారు. ఆ వివరాలు వెంటనే పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు, కుటుంబసభ్యులు, పెద్దలు, సాక్షుల మధ్య పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచాలని కోరారు. పోలీసులు వాస్తవాలు బయటపెట్టకపోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మత విద్వేషాలతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని మహాసేన రాజేష్ హెచ్చరించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest AP News And Telugu News
Updated at - Mar 28 , 2025 | 04:07 PM