అమెరికాలో భారతీయుడిపై బహిష్కరణ వేటు
ABN, Publish Date - Mar 20 , 2025 | 05:33 PM
అగ్రరాజ్యంలో మరో భారతీయుడిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్ సంస్థతో లింకులున్నాయనే నమోదైన అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే పరిశోధకుడిని భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో అతడిని భారత్‌కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ.. బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో బాదర్ ఖాన్ పరిశోధకుడిగా ఉన్నారు.
అగ్రరాజ్యంలో మరో భారతీయుడిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్ సంస్థతో లింకులున్నాయనే నమోదైన అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే పరిశోధకుడిని భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో అతడిని భారత్‌కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ.. బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో బాదర్ ఖాన్ పరిశోధకుడిగా ఉన్నారు. సోమవారం అర్థరాత్రి వర్జినీయాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఆయన వీసా సైతం రద్దు చేసినట్లు ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
పాలస్తీన ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉండడంతోపాటు సోషల్ మీడియాలో యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు బాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నారని.. అలాగే అతడిని భారత్‌కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. అయితే తన అరెస్ట్, స్వదేశానికి తరలింపును సూరి కోర్టులో సవాల్ చేశారు. తన భార్యకు పాలస్తీన మూలలు ఉండడంతోనే తనపై ఈ చర్యలు తీసుకున్నారంటూ సూరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 20 , 2025 | 05:33 PM