నిజామాబాద్‌లో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం లక్కీ డ్రా

ABN, Publish Date - Mar 25 , 2025 | 06:20 PM

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం నాడు కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ రామోజీరావు, డిచ్‌పల్లి ఎస్‌ఐ రఫీ పాల్గొన్నారు.

నిజామాబాద్: ఆంధ్రజ్యోతి22వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం నాడు కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా విజేతల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి,కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ రామోజీరావు, డిచ్‌పల్లి ఎస్‌ఐ రఫీ పాల్గొన్నారు. నిజామాబాద్ యూనిట్ పరిధిలో మొదటి బహుమతి బైక్‌ను యడపల్లి మండలానికి చెందిన వెంకటకృష్ణ గెలుచుకున్నారు. రెండో బహుమతి రిఫ్రిజిరేటర్‌ను బాన్సువాడకు చెందిన రాంచందర్ సొంతం చేసుకున్నారు. మూడో బహుమతి ఎల్‌ఈడీ టీవీని ఆదిలాబాద్‌కు చెందిన రహీమున్నీసాకు లభించింది.

Updated at - Mar 25 , 2025 | 06:22 PM