విజయకుమార్ సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:42 AM

రూ.839 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం వ్యవహారంలో పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిలోనే విజయకుమార్ రెడ్డి జవాబులిచ్చినట్లు సమాచారం. ఏబీసీ నిబంధనలకు విరుద్థంగా పక్షపాత ధోరణితో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో జగన్‌ మీడియాకు, వైసీపీ ప్రభుత్వ అనుకూల మీడియాకు దోచిపెట్టడం తప్పు కాదా అని ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే..

అమరావతి: జగన్‌ మీడియా (Jagan Media)కు, వైసీపీ కూలి మీడియాకు రూ.వందల కోట్లను ప్రభుత్వ ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వ్యవహారంపై ఏపీ ఐ అండ్‌ పీఆర్‌ (AP I & PR) మాజీ కమిషనర్‌ (former commissioner) విజయ్‌కుమార్‌రెడ్డి (Vijayakumar Reddy)ని ఏసీబీ అధికారులు (ACB Officers) వరుసగా రెండో రోజు గురువారం సుదీర్ఘంగా విచారించారు. బుధవారం 8 గంటలకుపైగా ఆయన్ను ప్రశ్నించగా.. గురువారం కూడా అదే పరిస్థితి. గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర సారథ్యంలో రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది.

Also Read..: Electric Shockతో ఇద్దరు ఉద్యోగులు మృతి..


రూ.839 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం వ్యవహారంలో పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిలోనే విజయకుమార్ రెడ్డి జవాబులిచ్చినట్లు సమాచారం. ఏబీసీ నిబంధనలకు విరుద్థంగా పక్షపాత ధోరణితో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో జగన్‌ మీడియాకు, వైసీపీ ప్రభుత్వ అనుకూల మీడియాకు దోచిపెట్టడం తప్పు కాదా అని ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నకు తనకుంటే ముందు పని చేసిన ముగ్గురు సీనియర్ అధికారులు ఏం చేశారో తాను కూడా అదే చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. 2014 నుంచి వారు ఎలా చేస్తే తానూ అలాగే చేశానని.. వారిది తప్పయితే తనది కూడా తప్పేనని అసలు అలా చేయడం తప్పని తనకు తెలియదని విజయకుమార్ చెప్పడంతో ఏసీబీ అధికారులు విస్మయానికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..

భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..

ఒక రైలు ఇంజిన్ ఎలా తయారవుతుందో తెలుసా..

For More AP News and Telugu News

Updated at - Apr 04 , 2025 | 11:42 AM