Home » Adilabad
పోలీసులు గ్రామీణ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
దరఖాస్తుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. 1993లో బెల్లంపల్లిలో నిర్మించుకున్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు మణిరామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు.
జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 14,951 మంది అభ్యర్థులకు గాను 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పని చేస్తున్న డే, నైట్ వాచ్మెన్స్, కుక్స్, కామాటీ, అవుట్ సోర్సింగ్ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న ఆరు మాసాల వేతనాలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.
బారెడు పొద్దెక్కినా ఇంకాసేపు ముసుగుతన్ని పడుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది! కప్పుకున్న దుప్పటి తీయబుద్ధేయడం లేదు.. మంచం దిగాలనిపించడం లేదు.. అంతా చలిపులి భయంతోనే! ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా..
నేను.. ఫలానా జిల్లాలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నేను ఈ జిల్లాకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ పనిచేసే వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి... అంటూ కొందరు ఉపాధ్యాయులు వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది.
జిల్లాలో ఆదివారం ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆదివారం నాటి పరీక్షలకు 14968 మంది అభ్యర్థులకుగాను ఉదయం 7446 మంది, మధ్యాహ్నం 7363 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకాగా, 83 మంది గైర్హాజరయ్యారు.
మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 400 డబుల్ బెడ్రూం ఇళ్లను పంచే శక్తిలేని నీవు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపో వద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కిష్టంపేట, కత్తెరసాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తుందని పేర్కొన్నారు.
పాత మంచిర్యాల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహా మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు నరహరి శర్మ ఆధ్వ ర్యంలో అయ్యప్ప అభిషేకంతోపాటు పడిపూజ నిర్వహించారు. అనం తరం అయ్యప్ప స్వాములు గ్రామంలో నగర సంకీర్తన చేశారు.