Home » Adilabad
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మంచిర్యాల డిపో పరిధిలో రద్దీ పెరిగింది. డిసెంబరు 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. నాటి నుంచి జీరో టికెట్‌తో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు వెసలుబాటు కల్పించారు.
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఇంతవరకు లబ్ధిదారులకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు జిల్లాలోని ఎంఎల్ఎస్ (మండల లెవల్ స్టాకిస్ట్) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్ షాపులకు చేరాల్సి ఉంటుంది.
తెలంగాణ ఉద్యమం సంద ర్భంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలను మార్చవద్దని నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అం దరూ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారన్నారు.
రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆరోపించారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురుకుల బాట జిల్లా ఇన్చార్జీ చైతన్య, రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్ కుమార్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బైరవాష్టమిని పురస్కరిం చుకుని ఆదివారం మండలంలోని పారుపెల్లి భైరవస్వామి ఆల యంలో కాలభైరవ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉద యం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలతోపాటు మొక్కులు తీర్చు కున్నారు.
ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలోని రైతులకు తీరని నష్టం వాటి ల్లింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి, పత్తి పం టలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి తడిసి పోవడంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని వేమనపల్లి, బెల్లంపల్లి, దండేపల్లి, జన్నారం మండలాల్లో అధిక నష్టం వాటిల్లి నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంట నీళ్ల పాలయిందని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందిస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని లక్షెట్టిపేట సివిల్ కోర్టు న్యాయాధికారి మహ్మద్ అసదుల్లా షరీఫ్ అన్నారు. శనివారం రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వ ర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.
ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే కోనోకార్పస్ మొక్కలను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పచ్చదనం కోసం జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని, వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పేర్కొంటూ ’ఆంధ్రజ్యోతి’లో ‘కోనోకార్పస్ మొక్కలతో ముప్పే’ శీర్షికన ఈ నెల 1న వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు శనివారం సిబ్బందితో వాటిని తొలగించారు.