Home » Adilabad
మంచిర్యాల- వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-163 పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హైవే నిర్మాణానికి సేకరించిన భూముల్లో ట్రెంచ్ తవ్వకాలు 70 శాతం మేర పూర్తికాగా, రైతులకు నగదు చెల్లింపులు అంతే శాతం పూర్తయ్యాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసం ధానం చేస్తూ నాలుగు వరుసలు గల నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే-163ని సుమారు 400 కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, కల్పించాలని శుక్రవారం ఐబీ చౌరస్తాలో ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాల న్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని శుక్రవారం ఐబీ చౌర స్తా నుంచి లక్షెట్టిపేటలోని ఉత్కూరు చౌరస్తా వరకు సైకిల్ యాత్ర చేప ట్టారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.
విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు,
కిష్టంపేట, ఆస్నాద్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ మోతిలాల్ పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు.
పులి సంచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్ శివారులోని ఓ పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు కలకలం రేపాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే మెయిల్ సర్వీస్ (ఆర్ఎంఎస్) సార్టింగ్ ఆఫీస్‌ను ఇక్కడి నుంచి తరలించే యోచనను పోస్టల్‌శాఖ ఎట్టకేలకు రద్దు చేసుకొంది. ఈ నెల 7న కార్యాలయం తరలిపోనుండగా, గురువారం ఆ ప్రయ త్నాన్ని విరమించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యా యి.
లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాన్ని నాశనం చేయాలని ప్రధాని కుట్రలు చేస్తున్నాడన్నారు.
నష్టాల బాటలో నడిచే ఆర్టీసీ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో పయనిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.