Share News

పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలి

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:27 PM

పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని శుక్రవారం ఐబీ చౌర స్తా నుంచి లక్షెట్టిపేటలోని ఉత్కూరు చౌరస్తా వరకు సైకిల్‌ యాత్ర చేప ట్టారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బీసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.

పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలి

గర్మిళ్ల/లక్షెట్టిపేట రూరల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని శుక్రవారం ఐబీ చౌర స్తా నుంచి లక్షెట్టిపేటలోని ఉత్కూరు చౌరస్తా వరకు సైకిల్‌ యాత్ర చేప ట్టారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బీసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.

దేశ జనాభాలో 60 శాతం, రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారానికి ఆమడదూరంలో ఉన్నారన్నారు. 36 పార్టీలు బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయని, వెంటనే రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. నాయకులు భీమ్‌సేన్‌, నర్సయ్య, కోటేశ్వర్‌రావు, లింగ య్య, మనోహర్‌, రమేష్‌, బిక్షపతి, రాజేశ్వరి, పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:27 PM