కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:03 PM
లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాన్ని నాశనం చేయాలని ప్రధాని కుట్రలు చేస్తున్నాడన్నారు.

లక్షెట్టిపేటరూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాన్ని నాశనం చేయాలని ప్రధాని కుట్రలు చేస్తున్నాడన్నారు. బీజేపీ నాయకులకు ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకు దిగినా కౌంటర్ ఇస్తామని పేర్కొన్నారు. సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలి కాని అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, పింగళి రమేష్, నాగభూషణం, పూర్ణచందర్‌రావు, శ్రీనివాస్,రాజేందర్, రాజు, శ్రీనివాస్, మాజీ ఎంపీటీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో...
ఉత్కూరు చౌరస్తాలో రైతులతో కలిసి రైతుగోస పేరిట నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లిని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేప డితే అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు అడ్డుకోవడం అమానుషమన్నారు. ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, గాదె శ్రీనివాస్, ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటరమణరావు, వెంకటకృష్ణ, మధు, రాజన్న, హరిగోపాల్, శ్రీదేవి,ప్రభాకర్, గురువయ్య,తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.