నేషనల్ హైవే పనులు ప్రారంభం
ABN , Publish Date - Dec 06 , 2024 | 10:32 PM
మంచిర్యాల- వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-163 పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హైవే నిర్మాణానికి సేకరించిన భూముల్లో ట్రెంచ్ తవ్వకాలు 70 శాతం మేర పూర్తికాగా, రైతులకు నగదు చెల్లింపులు అంతే శాతం పూర్తయ్యాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసం ధానం చేస్తూ నాలుగు వరుసలు గల నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే-163ని సుమారు 400 కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
మంచిర్యాల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల- వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-163 పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హైవే నిర్మాణానికి సేకరించిన భూముల్లో ట్రెంచ్ తవ్వకాలు 70 శాతం మేర పూర్తికాగా, రైతులకు నగదు చెల్లింపులు అంతే శాతం పూర్తయ్యాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసం ధానం చేస్తూ నాలుగు వరుసలు గల నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే-163ని సుమారు 400 కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పట్టణాలు, జనావాసాలకు దూరంగా మైదాన ప్రాంతాల మీదుగా సాగే విధంగా జాతీయ రహదారి నిర్మాణానికి రూపకల్పన చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జాతీయ రహదారి నిర్మా ణంలో భాగంగా మంచిర్యాల వయా మంథని వరంగల్ వరకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. రహదారి నిర్మాణం పూర్తయితే మూడు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య రవాణా మరింతగా సులభతరం కానుంది.
వేగం పుంజుకున్న పరిహారం చెల్లింపులు
నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో ట్రెంచ్‌ల తవ్వకాల పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయి. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు రైతులతో పరస్పర అంగీకారం కుదరడంతో నగదు చెల్లింపుల్లో వేగం పుంజుకున్నాయి.
హైవే నిర్మాణం కింద జైపూర్ మండలంలో సుమారు 110 హెక్టార్ల భూ సేకరణ జరిపారు. మండలంలోని ఇందారం శివారులోని నర్వా నుంచి పౌనూర్ గ్రామంలోని గోపాల్‌పూర్ వరకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 14 గ్రామాల్లోని 110 హెక్టార్ల భూములు రహదారి కోసం సేకరించారు. వీటికి సంబంధించి ఇప్పటి వరకు రూ.31 కోట్ల చెల్లింపులు జరుగగా, మరో రూ.15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
సందిగ్ధంలో వందల ఎకరాలు....
జాతీయ రహదారి కోసం అధికారులు సేకరించిన భూముల్లో ధరణిలో లేని వాటికి పరిహారం చెల్లించే విషయంలో కొంత సందిగ్ధం నెలకొంది. జిల్లాలో వందల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని తెలుస్తోంది. ప్రభు త్వం ప్రకటించిన విధంగా సాదా బైనామాను ఆన్‌లైన్ చేసుకోవడం కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్త కాలు అందలేదు. మరోవైపు ధరణి పోర్టల్‌లోనూ నమో దు చేయలేదని సమాచారం. దీంతో సంబంధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిహారంపై పెదవివిరుపు...
ఇదిలా ఉండగా రహదారి కింద ముంపునకు గురయ్యే భూములకు ప్రభుత్వపరంగా చెల్లించే పరిహారంపై కొం దరు రైతులు పెదవి విరుస్తున్నారు. బహిరంగ ధర ఎక రాకు కనీసం రూ.40 లక్షలు పలుకుతుండగా, అధికా రులు నిర్ణయించిన మేరకు అందులో సగం మాత్రమే వస్తుందనే నిరాశలో ఉన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద కోల్పోతున్న భూముల మాదిరిగా మార్కెట్ విలు వకు మూడు రెట్లు పరిహారం చెల్లిస్తే బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముంపు రైతులు కలెక్టర్ కుమార్‌దీపక్‌కు వినతిపత్రం అందజే శారు. అయినప్పటికీ పరిహారం విషయంలో ఎలాంటి పురోగతి లేదని రైతులు చెబుతున్నారు.
పెరుగుతున్న భూముల ధరలు...
జైపూర్ మండలం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో సమీపంలోని భూముల ధరలు పెరి గాయి. అధికారులు సేకరించిన సమయంలో ఉన్న ధరల కంటే ప్రస్తుతం రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల రైతులు ఆనందంలో ఉన్నారు. భూముల ధరలు పెరగ డంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తుండటంతో సమీపంలోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరా రూ.20 లక్షలు పలికే చోట ప్రస్తుతం రూ.50 లక్షల వరకు ధర పలుకు తున్నట్లు తెలుస్తోంది.