Home » Charminar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
ఇటీవల బుల్లెట్ వాహనం ట్యాంక్ పేలిన ఘటనలో తీవ్రం గా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈది బజార్కి చెందిన ఆ వాహన యజమాని అబ్దుల్ రహీమ్ఖాన్ (29) మంగళవారం మృతి చెందాడు.
తెలంగాణ అధికారిక చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడంపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమైన చార్మినార్, రామప్ప దేవాలయం, కాకతీయ తోరణంను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడంపై ఆయన నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ లోక్సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.
చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది.
పాతబస్తీకి మెట్రో నిర్మాణం అధికారులకు సవాలుగా మారింది. 5.5 కిలోమీటర్ల మార్గంలో 103 వరకు మతపరమైన మందిరాలు, సున్నితమైన నిర్మాణాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని వర్గాల సహకారం ఉంటేనే ఇక్కడ పనులను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టప్పాచబుత్రలో అర్ధరాత్రి ఘాటైన వాసన రావడంతో కలకలం రేగింది. ప్రమాదకరమైన వాసన కారణంగా రాత్రంతా స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆ వాసన భరించలేని విధంగా రావడంతో..
భారత్లో నెలవంక కనిపించింది.
నేడు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.