Home » Dengue
వానాకాలం కావడంతో చెత్తాచెదారం, ఇతర వ్యర్థాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా(Dengue, Malaria) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డెంగీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్(Viral infection) అని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
Dengue Symptoms and Prevention Tips: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వ్యాధులు కూడా పెరుగుతాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఈ డెంగ్యూ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు..
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులూ పెరుగుతున్నాయి.
రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్‌లో ఓ వైద్యుడు డెంగీ బారినపడి మృతిచెందారు.
కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాల గురించి రివ్యూ చేయడానికి మంత్రి మంగళూర్ వచ్చారు. రివ్యూ సంగతెంటో కానీ.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ బిజీగా ఉన్నారు. ఆ వీడియో చూసి విపక్ష బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
విపరీతమైన జ్వరం. ఒళ్లునొప్పులు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం.. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు!! రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే.. చాలామందిలో డెంగీ, చికున్‌గున్యా నిర్ధారణ అవుతోంది.
కర్ణాటక(karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో డెంగ్యూ కేసులు(dengue cases) కలకలం రేపుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గత మూడు వారాల్లోనే మొత్తం 1,036 కేసులు నమోదవగా, వాటిలో బీబీఎంపీ పరిధిలోనే డెంగ్యూ కేసులు 1,000 మార్క్‌ను దాటాయి.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే డెంగ్యూ జ్వరం(Dengue fever) విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలందుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు.
Telangana: అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు. దీంతో మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.