Share News

Karnataka: స్విమ్మింగ్‌పూ‌ల్‌లో ఈత కొడుతూ ..

ABN , Publish Date - Jul 08 , 2024 | 09:17 PM

కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాల గురించి రివ్యూ చేయడానికి మంత్రి మంగళూర్ వచ్చారు. రివ్యూ సంగతెంటో కానీ.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ బిజీగా ఉన్నారు. ఆ వీడియో చూసి విపక్ష బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

Karnataka: స్విమ్మింగ్‌పూ‌ల్‌లో ఈత కొడుతూ ..
Dinesh Gundu Rao

మంగళూర్: కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు (Dinesh Gundu Rao) తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాల గురించి రివ్యూ చేయడానికి మంత్రి మంగళూర్ వచ్చారు. రివ్యూ సంగతెంటో కానీ.. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ బిజీగా ఉన్నారు. ఆ వీడియో చూసి విపక్ష బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మంత్రి తీరుపై ఘాటుగా విమర్శలు చేయగా.. దినేశ్ గుండూరావు కూడా అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చారు.


విష జ్వరాల విజృంభణ

కర్ణాటకలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 7 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ సోకి ఆరుగురు చనిపోయారు. మలేరియా, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. విష జ్వరాల విజృంభణకు ప్రధాన కారణం.. నీటి కుంటలు, నీటి నిల్వ అనే సంగతి తెలిసిందే. డెంగ్యూ, మలేరియాపై రివ్యూ చేయడానికి ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండు రావు మంగళూర్ వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఈత కొడుతూ కనిపించడంతో బీజేపీ విరుచుకుపడింది.


నీరో రావు..

రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో నీటి కుంటలు అపరిశుభ్రంగా ఉన్నాయి. దాంతో జ్వరాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య మంత్రి మంచినీటిలో తేలియాడుతున్నారని ఘాటుగా విమర్శలు చేసింది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు ఇక్కడ ఆరోగ్య మంత్రిని నీరోతో పోల్చుతూ నీరో రావు అని ధ్వజమెత్తింది.

Supreme Court: నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాటిని కోల్పోతారన్న ధర్మాసనం


ఫిట్‌నెస్‌లో భాగం..

బీజేపీ విమర్శలపై మంత్రి దినేశ్ ఘాటుగా స్పందించారు. స్విమ్మింగ్, వ్యాయామం అనేది తన రోజువారి ఫిట్ నెస్‌లో భాగం అని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని బీజేపీ నేతలు పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యమే కాదు.. మెదడు చురుగ్గా పనిచేస్తోందని తనదైన శైలిలో విమర్శించారు.


For
Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 09:27 PM