Share News

Dengue Cases: 3 వారాల్లో వెయ్యికిపైగా డెంగ్యూ కేసులు.. నగరవాసుల భయాందోళన

ABN , Publish Date - Jun 26 , 2024 | 09:49 AM

కర్ణాటక(karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో డెంగ్యూ కేసులు(dengue cases) కలకలం రేపుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గత మూడు వారాల్లోనే మొత్తం 1,036 కేసులు నమోదవగా, వాటిలో బీబీఎంపీ పరిధిలోనే డెంగ్యూ కేసులు 1,000 మార్క్‌ను దాటాయి.

Dengue Cases: 3 వారాల్లో వెయ్యికిపైగా డెంగ్యూ కేసులు.. నగరవాసుల భయాందోళన
Dengue Cases

కర్ణాటక(karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో డెంగ్యూ కేసులు(dengue cases) కలకలం రేపుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గత మూడు వారాల్లోనే మొత్తం 1,036 కేసులు నమోదవగా, వాటిలో బీబీఎంపీ పరిధిలోనే డెంగ్యూ కేసులు 1,000 మార్క్‌ను దాటాయి. కేవలం 20 రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయని వైద్యధికారులు తెలిపారు. గతేడాది జూన్ గణాంకాలతో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉందని అధికారులు చెప్పారు.


అంతేకాదు BBMP చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కి కూడా డెంగ్యూ సోకింది. గిర్నాథ్‌కు శుక్రవారం నుంచి తేలికపాటి జ్వరం(fever) ఉంది. కానీ ఆయన పనికి వెళ్లడం కొనసాగించారు. ఆ క్రమంలో ఫ్రీడం పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు శనివారం డెంగ్యూ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.


చల్లని గాలులతో సహా ఈ ప్రాంతంలోని తీవ్రమైన వాతావరణ(weather) పరిస్థితుల కారణంగా ఈ డెంగ్యూ కేసులు పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డెంగ్యూ నియంత్రణకు కృషి చేస్తున్నామని బెంగళూరు బీబీఎంపీ(BBMP) అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ సర్వేలు నిర్వహించి దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు(Bengaluru)లో గత ఆరు నెలల్లో 2447 డెంగీ కేసులు నమోదవగా, అందులో గత మూడు వారాల్లోనే 1036 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,272 కేసులు నమోదయ్యాయి.

ఇటివల మహదేవపురా, ఈస్ట్ జోన్లలో అత్యధిక సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు(rains) ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఫీవర్, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం నేడే ఓటింగ్..ఎవరు గెలుస్తారంటే..!

Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్‌

సెన్సెక్స్‌ @ : 78,000


For Latest News and National News click here

Updated Date - Jun 26 , 2024 | 09:55 AM