Home » Gold Rate Today
గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి రేటు కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పుంజుకుంది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన గోల్డ్ రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం రూ.80,823 ఉండగా.. నేడు రూ.80,832కు చేరింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.88,170 కాగా.. నేడు రూ.88,180 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి.
బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల బంగారానికి ధర రోజు రోజుకు పెరుగుతోంది. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు.దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో గోల్డ్ ధర రోజు రోజుకు పెరుగుతోంది.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినప్పటికీ గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర ఉట్టెక్కింది.
భారత్లో పుత్తడి ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును చేరింది. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీనపడ్డ డాలరు, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితి వెరసి అనేక మందికి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మళ్లడంతో పసిడి ధర చారిత్రక గరిష్ఠాన్ని చేరుకుంది.
దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఓసారి నేటి ధరలను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే ఇటీవల దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న ఈ రేట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.