Home » Nagarjuna Sagar
నాగార్జునసాగర్‌లో సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టులో ప్రతిపాదించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కృష్ణానదికి వరదలు తగ్గిపోవడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు మూసుకున్నాయి. సోమవారం ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా.. తుంగభద్ర మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసేశారు. అన్నింటిలోనూ సంతృప్తికర స్థాయిలో నీటి నిల్వలున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు భద్రమేనా? అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌కి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్ వద్దకు భారీగా తరలి వస్తున్న పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదు.
కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద గణనీయంగా పడిపోయింది. శుక్రవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం 87 వేలకు తగ్గింది.
ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం డ్యాం సైట్ వద్ద 3,92,415 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. జూరాల, సుంకేశుల నుంచే 3,29,576 క్యూసెక్కుల వరద చేరుతోంది.