Home » Nagarjuna Sagar
కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
నాగార్జునసాగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో(Oxford School) ఈనెల 23న జరిగిన రెహమాన్(Rahman) హత్య కేసును విజయపురి పోలీసులు(Vijayapuri police) ఛేదించారు. నిందితుడు శివసాయిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారి తీసినట్లు ఆయన వెల్లడించారు.
వానాకాలం వరద సీజన్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కేఆర్ఎంబీ( కృష్ణానది యాజమాన్య బోర్డు) ఛైర్మన్ అశోక్ గోయల్ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్ సిబ్బంది ట్యాంక్ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది.
‘‘గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నరు. నేను వాళ్లను అడుగుతున్నా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు, మంజీరా నీళ్లను కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?
గౌతమ బుద్ధుడు చేసిన బోధనల్లో ‘ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు.. ప్రతీ పనిని ధ్యానంగా చేయాలి’ అనే బోధన తనకు ఎంతో ఇష్టమైనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది పైకి రెండు లైన్లుగా కనిపిస్తుందిగానీ, అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానమంతా అందులో ఉందన్నారు.