Share News

Water Allocation: కాళేశ్వరం కింద 98,570 ఎకరాలకు సాగునీరు

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:11 AM

ప్రస్తుత ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Water Allocation: కాళేశ్వరం కింద 98,570 ఎకరాలకు సాగునీరు

  • సాగర్‌ కింద 6.45 లక్షల ఎకరాలకు..

  • స్కైవమ్‌ భేటీ మినట్స్‌ విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 71,600 ఎకరాల్లో వరి, 26,970 ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీటిని అందించనున్నారు. దాదాపు రూ.లక్ష కోట్ల దాకా ఈ ప్రాజెక్టుకు ఖర్చుచేసినా.. ఆయకట్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో 98,570 ఎకరాలకే పరిమితమైంది. వానాకాలంలో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగు నీటిపై ఈనెల 3వ తేదీన స్కైవమ్‌(రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ) చైౖర్మన్‌ ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలో భేటీ జరగ్గా.. సమావేశపు మినట్స్‌ తాజాగా విడుదలయ్యాయి.


నాగార్జున సాగర్‌ కింద ఈ దఫా 6.45 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రబీలో ప్రాజెక్టులో నీరు లేక సాగర్‌ కింద రైతులు ‘పంట విరామం’ ప్రకటించారు. కానీ ఈసారి రెండు పంటలకు నీరివ్వడానికి వీలుగా సాగర్‌లో నిల్వలున్నాయి. ఇక కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి 125 టీఎంసీల నీటిని 14.5 లక్షల ఎకరాలకు.. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి 188 టీఎంసీల నీటిని 17.95 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఇప్పటికే నిర్ణయించారు.

Updated Date - Aug 09 , 2024 | 03:11 AM