Home » Posani Krishna murali
Posani Krishna Murali:అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.
సీని నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు.
ఒక్కసారి పాతరోజుల్లోకి వెళదాం! 2019లో అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ ఏం చేశారో గుర్తుతెచ్చుకుందాం! పదవిలో కూర్చున్నది మొదలు... కక్ష సాధింపులు! తొలి ఆరు నెలల్లోనే...
‘నన్ను అరెస్టు చేశారు.. రాజా..!’ సినీనటుడు పోసాని కృష్ణమురళి గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లోకి వెళుతూ బయట ఉన్న జనంతో అన్న మాటలివీ!
పోసాని కృష్ణ మురళీకి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానం తీర్పుపై హైకోర్టుకు వెళతామని అన్నారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ‘ఆపరే షన్ సక్సెస్ పేషెంట్ డైడ్’ అన్న ట్లు ఉందన్నారు.
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
హద్దులు దాటిన వారిపై చర్యలు కూడా తీసుకుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం అంతా ‘రివర్స్’! ప్రతిపక్ష నాయకులతో పాటు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో మహిళలను ఆ పార్టీ నేతలు...
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.
వైసీపీ అధికారంలో ఉండగా... టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి, అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.