Share News

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి అనారోగ్యం

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:31 PM

Posani Krishna Murali:అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి అనారోగ్యం
Posani Krishna Murali

అన్నమయ్యజిల్లా: సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఇవాళ(శనివారం) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెనొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని కృష్ణ మురళి చెప్పారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పతికి జైలు అధికారులు తరలించారు. రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పోసాని కృష్ణ మురళికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోసానిని మెరుగైన వైద్యం కోసం రాజంపేట ప్రభుత్వాస్పత్రి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.


ALSO READ: Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

ఓబుళవారిపల్లెలో పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు..

కాగా.. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లి... నోటీసులు అందించి, అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులను కలిసి... పోసాని కృష్ణ మురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 24వ తేదీ మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో ధూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో సెక్షన్‌ 196, 353 (2), 111 రెడ్‌విత్‌ 3(5) కింద కేసు (క్రైమ్‌ నంబర్‌ 65/2025) నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయనను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు.


టీడీపీ, జనసేన అగ్రనేతలపై విమర్శలు..

2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే పోసాని కృష్ణ మురళి టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డగోలుగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై శ్రుతిమించి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక... వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన మరింత రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను అసభ్యంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి ప్రతిఫలంగా జగన్‌ ఆయనకు ఏపీ ఫిల్మ్‌డెవల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. ప్రెస్‌మీట్లు, టీవీ డిబేట్లు, సోషల్‌ మీడియా వేదికలపై టీడీపీ, జనసేన నేతలను పోసాని అసభ్య పదజాలంతో తిట్టిన సందర్భాలు ఎన్నోఉన్నాయి. పత్రికల్లో ప్రచురించలేని భాష కూడా వాడారు. పోసాని వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు అప్పట్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు, విజయవాడ, నర్సారావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళిపై ఏపీవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 03:57 PM