Home » YSRCP
Alapati Rajendra Prasad: జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం కలిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ వ్యవస్థలను అన్నిటిని నిర్వీర్యం చేసి విధ్వంసక పాలన సాగించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
Payyavula Keshav: వైసీపీ అధినేత జగన్‌కు మతి భ్రమించిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడపడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు.
అంతేకాదు.. లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డి పేరును తీసుకురావడంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు జగన్. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి..
Buddha Venkanna: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే అని ఆరోపించారు. జగన్‌ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న చెప్పారు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.
YSRCP: వైసీపీ నేత మరోసారి రెచ్చిపోయాడు. అమాయకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. అతనిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయిన ఎంతమాత్రం కూడా ఆ వైసీపీ నేత తన ప్రవర్తన తీరు మార్చుకోలేదు. మరోసారి బరితెగించి ఓ కార్పెంటర్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది.
అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు.
ఇది జగన్ సర్కారు చేసిన ‘భూగాయం!’ దీనిని మాన్పేందుకు కూటమి సర్కారు నానా తంటాలు పడుతోంది.
తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఈరోజు జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి, టీడీపీ నేత ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
Tirupati Deputy Mayor election: తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హైడ్రామా నడిచింది. తిరుపతిలో కార్పొరేటర్లతో కూటమి, వైసీపీ స్పెషల్ క్యాంప్స్ నిర్వహించింది.