రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి అర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఉమ్మడి జిల్లా కాంగ్రె్సలో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాబినెట్ విస్తరణ అనంతరం పెండింగ్లో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులకు నియామకాలు చేపడతామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించినప్పటికీ, క్యాబినెట్ విస్తరణ రోజురోజుకూ జాప్యమవుతోంది.
యాదాద్రిభువనగిరి జిల్లాను గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కుదిపేశాయి. ఉదయం వరకు ఉక్కపోతు, వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది.
డిండి రిజర్వాయర్ను పూడిక దెబ్బతీస్తోంది. నీటినిల్వ సామర్థ్యం ఏడాదికేడాదికి క్రమంగా తగ్గుముఖంపడుతోంది
ఎల్ఆర్ఎస్ 25శాతం ఫీజు రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని గడువులోగా రాయితీతో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూ చించారు.
రాజీవ్ యువ వికాస్ పథకం నిరుద్యో గ యువతకు వరంలాంటిదని, యువత ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవే ట్ కళాశాలల యాజమాన్యాలు, వేతనాల కోసం లెక్చరర్ల బహిష్కరణ ప్రభావం డిగ్రీ ప్రాక్టికల్స్ పరీక్షలపై ప్రభావం చూపింది. ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమైనా, ప్రైవేట్డిగ్రీ కళాశాలలు తెరుచుకోలేదు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం కింద తొలిసారి బియ్యం అందుకున్న మహిళలు ఆ బియ్యం బాగున్నాయని, అన్నం బాగా అయిందని సంబరపడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోంది. 103 ఏళ్ల బ్యాంకు చరిత్ర లో ఇప్పటి వరకు కేవలం రూ.900కోట్ల టర్నోవర్ ఉండ గా, ప్రస్తుతం రూ.2,850కోట్లకు పైగా టర్నోవర్కు చేరుకుంది.
అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రానికి భద్రత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఆలయానికి భద్రత కొరవడినట్లు కన్పిస్తోంది.