పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-14T05:54:48+05:30 IST

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ రెండోరోజు విజయవంతమైంది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ మూసి వేశారు. రోడ్లన్నీ బోసిపోయాయి. వైరస్‌ కట్టడికి ప్రతీఒక్కరు సహకరించాలని పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీ సుకుంటూ జరిమానాలు విధించారు. ప్రధాన కూడలిలో పికెటింగ్‌ నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో ఎస్పీ పలు కూడలిలో నిబంధనలు ఉల్లంఘిం చిన వారికి జరిమానాలు విధించారు. ప్రధాన రహదారుల కూడలిలో పో లీసులు ప్రత్యేక పికెటింగ్‌లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌
ఆదిలాబాద్‌ పట్టణంలో నిర్మానుష్యంగా మారిన రోడ్డు

ఆదిలాబాద్‌అర్బన్‌, మే13: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ రెండోరోజు విజయవంతమైంది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ మూసి వేశారు. రోడ్లన్నీ బోసిపోయాయి. వైరస్‌ కట్టడికి ప్రతీఒక్కరు సహకరించాలని పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీ సుకుంటూ జరిమానాలు విధించారు. ప్రధాన కూడలిలో పికెటింగ్‌ నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో ఎస్పీ పలు కూడలిలో నిబంధనలు ఉల్లంఘిం చిన వారికి జరిమానాలు విధించారు. ప్రధాన రహదారుల కూడలిలో పో లీసులు ప్రత్యేక పికెటింగ్‌లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ లాక్‌డౌన్‌ అమలును  పర్యవేక్షించారు.
బోథ్‌: మండలంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుతున్నారు. దీంతో వివిధ గ్రామాల నుంచి బోథ్‌కు వివిధ పనులపై వచ్చే వారు సమయం సరిపోక ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్‌లో 8 నుంచి 10గంటల వరకు జనం రద్దీగా ఉంటుంది. లాక్‌డౌన్‌ విషయంలో పొలీసులు కఠినం గా వ్యవహరించడంతో పల్లెప్రజలు లాక్‌డౌన్‌ విషయంలో పోలీసులు కఠి నంగా వ్యవహరించడంతో పల్లె ప్రజలు లాక్‌డౌన్‌ సమయంలో బయటకు రాలేకపోతున్నారు. వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం జనంలేక బోసిపోయి కనిపిస్తున్నాయి.
రోడ్డుపై వెళ్లే వాహనాలను నిలిపివేస్తున్న పోలీసులు
తాంసి: లాక్‌డౌన్‌ సంపూర్ణంగా జరుగుతుంది. అంతరాష్ట్ర రహదారిపై ఉదయం పది దాటింది అంటే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతీ వాహనాన్ని నిలిపి వేసి జరిమానా విధిస్తున్నారు. తాంసి ఇన్‌చార్జి ఎ స్సై దమ్ముశ్రీ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రతీ గ్రామంలో తిరుగుతు కరోనా విషయంపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. దినం రాత్రి వీధుల్లో ఉంటూ ప్రజలకు తనవంతు సేవలు అందిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కరోనా నిబంధనలను ప్రతీఒక్కరు పా టించాలన్నారు. అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు. ఉదయం పది దాటింది ఎవరు బయటకు రావద్దని కోరారు. ఒకవేళ వ చ్చినట్లయితే చలానా విధిస్తామని హెచ్చరించారు. విద్యావంతులైన యు వత కరోనా విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సిబ్బంది భాను, సంతోష్‌, రాజేందర్‌సింగ్‌ తదితరులున్నారు.
జైనథ్‌: మండల కేంద్రమైన జైనథ్‌లో లాక్‌డౌన్‌ గురువారం పకడ్బం దీగా అమలు జరుగుతుంది. ప్రజలు, రైతులు, కూలీలు, ఇతరులు కరోనా నేపథ్యంలో సహకరిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర మీదుగా జై నథ్‌, బేల మండలాల నుంచి వస్తున్న వాహనాలను విధిగా తనిఖీ చేస్తు న్నారు. ప్రజలు విధిగా భౌతికదూరాన్ని పాటించి మాస్కులను ధరించాల ని  జైనథ్‌ రూరల్‌ సీఐ కె.మల్లేష్‌ సూచించారు. ఇందులో జైనథ్‌  మండల ఎస్సై సాయిరెడ్డి వెంకన్న, ట్రైనీ ఎస్సై తెరిసిస్‌లతో పాటు డొల్లార చెక్‌పో స్టు పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
ఉట్నూర్‌: ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు గంటల పాటు ప్రజలతో సందడిగా కనిపిస్తున్న ప్రాంతాలు 20 గంటల పాటు లాక్‌డౌన్‌ బాట ప ట్టాయి. ఉట్నూర్‌ ఏజెన్సీ కేంద్రంలో గురువారం ఉదయం ఆరు గంటల నుంచి వ్యాపార సంస్థలు తెరుచుకోవడంతో శుక్రవారం  రంజాన్‌ పండుగ పురస్కరించుకొని ముస్లింలతో పాటు ఇతరులు సైతం వ్యాపార సంస్థలకు చేరుకోవడంతో నాలుగు గంటల పాటు సందడి వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత ఉదయం 10 గంటల నుంచి పోలీసులు వ్యాపార సంస్థలను మూసి వేయించారు. దీంతో ఉట్నూర్‌ పట్టణంలోని వ్యాపార సంస్థలు మూతపడడంతో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ బ స్సులు సైతం నాలుగు గంటల పాటు జిల్లా కేంద్రానికి రెండు బస్సులు, కుమ్రం భీం జిల్లా కేంద్రానికి రెండు సర్వీసులు, మంచిర్యాల జిల్లాలోని ల క్షటిపేట వరకు ఒక సర్వీసును ఉట్నూర్‌ డిపో నుంచి నడిపించారు. అత్యవసరం ఉన్న ప్రయాణికులు లారీలను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
కఠిన ఆంక్షలతో కొనసాగుతున్న లాక్‌డౌన్‌
ఇచ్చోడ: కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించి కరోనాను జయించాలని ఇచ్చోడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ అన్నారు. గురువారం విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల లోపు అత్యవసర పనులు ముగించాలని, మార్కెట్‌కు ఉదయం సమయంలో వచ్చే ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతీఒక్కరు ముఖానికి మా స్క్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలని గుంపులు గుంపులగా తిరిగితే చర్యలు తప్పవని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు. మండల కేంద్రంలో గట్టి బందోబస్తు ఎస్పై ఫరిద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పెళ్లిళ్లు చేస్తే చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించి ఇంటి వద్దే ఉండాల ని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T05:54:48+05:30 IST