ఏసీబీ ట్రాప్‌లో కాప్రా మున్సిపాలిటీ డీఈ

ABN , First Publish Date - 2021-05-31T12:44:14+05:30 IST

కరోనా మహమ్మారితో ప్రజలు హడలెత్తిపోతుంటే...ఈ సమయంలో కూడా ప్రభుత్వ లంచగొండి అధికారులు తమ తీరును మార్చుకోవడం లేదు.

ఏసీబీ ట్రాప్‌లో కాప్రా మున్సిపాలిటీ డీఈ

హైదరాబాద్: కరోనా మహమ్మారితో ప్రజలు హడలెత్తిపోతుంటే...ఈ సమయంలో కూడా ప్రభుత్వ లంచగొండి అధికారులు తమ తీరును మార్చుకోవడం లేదు. అమాయకులను లంచాలతో  అవినీతి పరులు పట్టి పీడిస్తున్నారు. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న డీఈ మహాలక్ష్మి ఏసీబీ ట్రాప్‌లో పడ్డారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పేద ఉద్యోగి బిల్ మంజూరు చేయడం కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.... కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలోతో పాటు డీఈ మహాలక్ష్మి నివాసంలో సోదాలు నిర్వహించిస్తున్నారు.

Updated Date - 2021-05-31T12:44:14+05:30 IST