ఆటో పట్టిన చిట్టి చేతులు.. ఆదుకున్న లోకేశ్
ABN , First Publish Date - 2021-09-04T08:45:47+05:30 IST
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి గోపాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అంధులు.

చంద్రగిరి, సెప్టెంబరు 3: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి గోపాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అంధులు. దీంతో ఈ చిన్నారి బ్యాటరీ ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఆటోలో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని, నిత్యావసరాలు తీసుకుని సమీప గ్రామాల్లో తిరుగుతాడు. ఇలా సాగే వ్యాపారమే వారి కుటుంబానికి జీవనాధారం. ఈ చిన్నారి కష్టాలు పడుతున్న కష్టం తెలుసుకుని చలించిన టీడీపీ నేత నారా లోకేశ్ వెంటనే గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. అతడి చదువు బాధ్యతనూ తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బ్యాటరీ ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు మరో రూ.2 లక్షలు టీడీపీ నుంచి అందిస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.