Home » TOP NEWS
పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ అన్నారు. నాకు హిందీ సరిగా రాదు.. తప్పుగా మాట్లాడితే క్షమించాలని అక్కడ ఉన్న అభిమానులను కోరారు. ట్రైలర్ రిలీజ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాట్నా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్‌కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.
వైసీపీ నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి కుద్రపూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా వి.కొత్తకోట అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తుండగా..
కూతురు నిశ్చితార్ధానికి సిద్ధమైన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వెంకటరెడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువతి గీతావాణి(24) అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్