వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి?: ఆలపాటి రాజా
ABN , First Publish Date - 2020-09-20T23:00:02+05:30 IST
వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి? అని మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు.

అమరావతి: వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటి? అని మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున ఆలయాలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, కోర్టులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని ఏది మాట్లాడినా చెల్లుతుందా అని నిలదీశారు. విశాఖ భూములపై సీబీసీ విచారణ జరగాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. ఎన్డీబీ నిధులతో చేసే పనుల్లో కొందరికే టెండర్లు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. ఈఎస్‌ఐ కేసులో ఏ3 ప్రమోద్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని రాజా ప్రశ్నించారు.