నేడు ‘జగనన్న శాశ్వత భూ హక్కు...భూరక్ష’ పథకం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-21T14:18:53+05:30 IST
‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు..భూరక్ష పథకం’’ ఈరోజు ప్రారంభంకానుంది.

అమరావతి: ‘‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు..భూరక్ష పథకం’’ ఈరోజు ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటనలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.