ప్రాథమిక పాఠశాలల పనివేళలపై స్పష్టత

ABN , First Publish Date - 2020-12-10T05:22:28+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లో పనివేళల్లో స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు డీఈఓ విఎస్‌.సుబ్బారావు తెలిపారు.

ప్రాథమిక పాఠశాలల పనివేళలపై స్పష్టత
childrens


ఒంగోలు విద్య, డిసెంబరు 9 : ప్రాథమిక పాఠశాలల్లో పనివేళల్లో స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు డీఈఓ విఎస్‌.సుబ్బారావు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం పాత పనివేళల ప్రకారమే రెండు పూటలా పనిచేస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పాఠశాలల్లో పనిచేయాలని డీఈఓ చెప్పారు. పాఠశాల అవాస ప్రాంతాల్లో బడీడు పిల్లలందరిని తల్లిదండ్రులు కమిటీ, అంగన్‌వాడీ సహకారంతో పాఠశాలలో చేర్పించాలని డీఈఓ ఆదేశించారు. 

Updated Date - 2020-12-10T05:22:28+05:30 IST