
CSK vs RCB IPL 2025 Live: మరో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
ABN , First Publish Date - Mar 28 , 2025 | 06:41 PM
CSK vs RCB IPL 2025 Live Updates in Telugu: చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మధ్య హోరా హీరో పోరు జరుగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

Live News & Update
-
2025-03-28T23:18:52+05:30
చెన్నైపై ఆర్సీబీ ఘన విజయం..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.
-
2025-03-28T21:54:58+05:30
మరో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
దీపక్ హుడా ఔట్.
4వ ఓవర్ 4వ బంతికి హుడా ఔట్ అయ్యాడు.
సీఎస్‌కే స్కోర్ 26/3
-
2025-03-28T21:45:17+05:30
చెన్నైకి షాక్.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే..
రాహుల్ త్రిపాఠి
గైక్వాడ్ పెవిలియన్‌కు చేరుకున్నారు.
-
2025-03-28T21:44:13+05:30
సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే..
నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ 197 పరుగులు చేసింది.
చెన్నైకి 198 పరుగుల టార్గెట్ విధించింది.
-
2025-03-28T20:55:09+05:30
హాఫ్ సెంచరీ కొట్టిన పాటిదార్..
-
2025-03-28T20:45:46+05:30
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
లివింగ్ స్టన్ ఔట్.
9 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
ఆర్సీబీ స్కోర్ 153/4, 16 ఓవర్లు.
-
2025-03-28T20:32:12+05:30
ఆర్సీబీకి పెద్ద దెబ్బ..
విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు.
నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ కొట్టగా.. రచిన్ రవిచంద్ర క్యాచ్ పట్టాడు.
30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులు చేశాడు కోహ్లీ.
-
2025-03-28T20:23:48+05:30
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
దేవ్‌దత్ పడిక్కల్ ఔట్.
అశ్విన్ బౌలింగ్‌లో పడిక్కల్ కొట్టిన బంతిని గైక్వాడ్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు.
పడిక్కల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లలో 27 పరుగులు చేశాడు.
ఆర్సీబీ స్కోర్ 108/2, 10 ఓవర్లు
-
2025-03-28T20:05:27+05:30
ఆర్సీబీ స్కోర్ ఎంతంటే..
7 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ స్కోర్ 73/1
-
2025-03-28T19:54:47+05:30
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
ఓపెనర్ సాల్ట్ ఔట్
ఫిల్ సాల్ట్‌ని స్టంప్ ఔట్ చేశాడు ధోని.
సాల్ట్ 16 బంతుల్ల 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 32 పరుగులు చేశాడు.
-
2025-03-28T19:14:52+05:30
సీఎస్‌కే జట్టు ఇదే..
-
2025-03-28T19:14:51+05:30
ఆర్సీబీ టీమ్ ఇదే..
-
2025-03-28T19:10:28+05:30
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్‌కే..
-
2025-03-28T18:41:52+05:30
CSK vs RCB Live Updates in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించడంతో.. ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే స్టేడియం వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. తమ అభిమాన జట్టే గెలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.