నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం
ABN , First Publish Date - 2020-07-09T01:55:15+05:30 IST
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే కిడ్నాప్‌కు గురైన తల్లీ, కొడుకును గంటల వ్యవధిలోనే పోలీసులు రక్షించారు. వివరాల్లోకెళితే.. ఆదిలక్ష్మీ, ఆమె

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే కిడ్నాప్‌కు గురైన తల్లీ, కొడుకును గంటల వ్యవధిలోనే పోలీసులు రక్షించారు. వివరాల్లోకెళితే.. ఆదిలక్ష్మీ, ఆమె కొడుకు ప్రజ్వల్ నాంపల్లి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇవాళ స్థానిక గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఆదిలక్ష్మిని, ప్రజ్వల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు, రెండు గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను ఛేదించారు. బాధితులను సురక్షితంగా కాపాడి, కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.