అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొని మోసపోకండి
ABN , First Publish Date - 2021-09-09T05:23:22+05:30 IST
అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొనుగోలు చేసి మోసపోకండని ఎంపీడీవో లీలామాధవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బసినికొండ, కొత్తపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.

మదనపల్లె రూరల్, సెప్టెంబరు 8: అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొనుగోలు చేసి మోసపోకండని ఎంపీడీవో లీలామాధవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బసినికొండ, కొత్తపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. బసినికొండ పంచాయతీలో సర్వే నెం.43-5, 44-2, 44-3ల్లో, అదేవిధంగా కొత్తపల్లె పంచాయతీలో సర్వే నెం.384-3లో అనుమతి లేకుండా లేఅవుట్లు వేశారన్నారు. పంచాయతీ కార్యదర్శులు పద్మాకుమారి, గోవర్దన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.