పన్నులు పెంచడమే ధ్యేయంగా వైసీపీ పాలన: ఆలపాటి
ABN , First Publish Date - 2021-06-09T18:31:26+05:30 IST
ఏపీలో పన్నులు విధింపుపై హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు.

గుంటూరు: ఏపీలో పన్నులు విధింపుపై హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. పన్నులు పెంచడమే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోందని విమర్శించారు. సంపద పెంచుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆస్తి విలువపై పన్ను విధింపు ఇప్పుడే చూస్తున్నామని తెలిపారు. చెత్త మీద పన్ను విధింపు గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. సామాన్యుడు బ్రతికే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యే లు ఉన్నారనే నిరంకుశంగా పాలన సాగిస్తున్నారన్నారు. తక్షణమే 197,198 జీఓలను రద్దు చేయాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.
