నయనానందకరంగా శ్రీవారి కల్యాణం
ABN , First Publish Date - 2021-07-26T05:13:13+05:30 IST
శ్రావణ నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమల తొలిగడప దేవునికడపలో వెలసిన లక్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

కడప (మారుతీనగర్), జూలై 25: శ్రావణ నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమల తొలిగడప దేవునికడపలో వెలసిన లక్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో ఏకాంతంగా ప్రధాన అర్చకుల వేదమంత్రాల, మంగళవాయిద్యాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణం కమనీయంగా సాగింది. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.