పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2021-01-17T06:20:47+05:30 IST

పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి

పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి
బోట్‌ ఎక్కేందుకు క్యూలైన్‌లో పర్యాటకులు


కైకలూరు, జనవరి 16: పక్షుల కేంద్రంలో పర్యాటకులు సందడి చేశారు. పలు రాష్ర్టాల నుంచే కాక, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు విదేశీ వలస పక్షులు చూసేందుకు భారీగా తరలిరావడంతో ఆటపాక పక్షుల కేంద్రం పర్యాటకులతో కిక్కిరిసి పోయింది. అధిక సంఖ్యలో బోటులో షికారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మరబోట్లు నడుస్తూనే ఉన్నాయి. వాచ్‌టవర్లపై నుంచి పక్షుల విన్యాసాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.





Updated Date - 2021-01-17T06:20:47+05:30 IST