రమ్య హత్య పోలీసు వైఫల్యం కాదా: ఆలపాటి రాజా
ABN , First Publish Date - 2021-08-18T21:09:14+05:30 IST
రక్షక యంత్రాంగం భక్షక యంత్రాంగంలా మారిపోయిందని టీడీపీ నేత ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

గుంటూరు: రక్షక యంత్రాంగం భక్షక యంత్రాంగంలా మారిపోయిందని టీడీపీ నేత ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శించటానికి వెళ్లినందుకు వైసీపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. తమపై ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు చూస్తే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయ్యిందో అర్థమవుతోందన్నారు. రమ్య హత్య పోలీసు వైఫల్యం కాదా అని ఆలపాటి రాజా ప్రశ్నించారు. గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణం ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు అధికారానికి తలొగ్గటం మానుకోవాలని హితవు పలికారు.