మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్టు

ABN , First Publish Date - 2021-03-22T17:11:30+05:30 IST

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్‌ను పోలీసులు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్టు

విజయవాడ: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్‌ను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణం పలు కేసుల్లో అరెస్టయి.. కొద్ది కాలం క్రితం విశాఖపట్టణం జైల్లో శిక్ష అనుభవించారు. ఇటీవల బెయిల్‌పై విడుదల అయి మోకాలి చికిత్స కోసం ఛండిగడ్ వెళ్లి వచ్చారు. ఆయనను ఇంటికి తీసుకువచ్చేందుకు బంధువు విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైలు దిగే సమయంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యంపై ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదయ్యాయి.


సుబ్రహ్మణ్యంకు ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆయన అనుచరుడు గురజాల రవీంధ్రరావును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన మంచిర్యాల పోలీసులే అరెస్టు చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల సీపీ సత్యాన్నారాయణ గతంలో ప్రకాశం జిల్లా ఏఎస్పీగా పనిచేసి ఉండడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై దృష్టి పెట్టారు. వారణాసి సుబ్రహ్మణ్యం అరెస్టు వివరాలను ప్రకటించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-03-22T17:11:30+05:30 IST